పోటీ నుంచి తప్పుకున్న ఆది సాయికుమార్

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీనివాస్ నాయుడు ఈ సినిమాను తెరకెక్కించగా.. చింతలపూడి శ్రీనివాసరావు, చావలి రామాంజనేయులు నిర్మాతగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందించగా.. సురభి, రాశి హీరోయిన్‌గా నటించారు.

SASHI RELEASE ON MARCH19

అయితే ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు కానీ అదే వారంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా విడుదల కానుంది. ఉప్పెన సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో… సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఆది సాయికుమార్ పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో శశి రిలీజ్ డేట్‌ను మేకర్స్ మార్చారు. మార్చి 19న శశి సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.