Tollywod: ఫిబ్ర‌వ‌రి 6న ‘ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’ బార‌సాల వేడుక..

Tollywod: ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో, రామ్ కార్తీక్‌- అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన Tollywod ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు. కాగా, ఈ నెల 6న, శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జ‌ర‌గ‌నున్న‌ది.

Fcuk prerelease

ఈ విష‌యం తెలియ‌జేస్తూ, “ఎఫ్‌సీయూకే బార‌సాల వేడుక ఫిబ్ర‌వ‌రి 6న” అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి బార‌సాల వేడుక ఏమిటి!.. అంటూ అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం, కుతూహ‌లం వ్య‌క్త‌మ‌వుతున్నాయి క‌దా. Tollywod ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపారు. బార‌సాల వేడుక రోజునే ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వీట‌న్నింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచ‌నాల‌ను అనూహ్యంగా పెంచేసింది. Tollywod రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా టైటిల్ రోల్ చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ యాంగిల్‌ను ఆయ‌న పండించిన తీరు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించ‌నున్నాయి. Tollywod ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన జ‌గ‌ప‌తిబాబు చాలా కాలం త‌ర్వాత ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించ‌గా.. ఇటీవ‌ల వ‌రుస‌గా ఈ సినిమాలోని పాటలను.. వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బంది లాంటి కొవిడ్ హీరోల చేతుల మీదుగా విడుద‌లై సంగీత ప్రియుల ఆద‌రాభిమానాల‌ను పొందుతున్నాయి.