ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `కిరాతక`. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన `కిరాతక` టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు `కిరాతక` ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా… హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ – “నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. కాని ఈ థ్రిల్లర్ కథ నాకు బాగా నచ్చింది. పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్‌గారికి, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్“అన్నారు.
నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ – “మా విజన్ సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా `కిరాతక` చిత్రం రూపొందుతోంది. మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్‌గారి హిట్ కాంబినేషన్ లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వీరభద్రమ్ గారు చెప్పిన కథ బాగా నచ్చి పాయిల్ రాజ్‌పూత్ హీరోయిన్గా నటిస్తుంది. తప్పకుండా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తాం అనే నమ్మకం ఉంది. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరిపి ఆగస్ట్ 13నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం“అన్నారు.
చిత్ర దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ – “ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. `కిరాతక` కథ నచ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. భారీ బడ్జెట్‌తో విజన్ సినిమాస్ బ్యానర్లో నాగం తిరుపతి రెడ్డిగారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు“ అన్నారు.
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పూత్, పూర్ణ, దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ల,
నిర్మాత: డా. నాగం తిరుపతి రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. వీరభద్రమ్.