కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఒక పాత్ర ఎంపిక చేసుకున్నపుడు ఏ అంశాలు చూస్తారు ?
-పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్ కూడా చేశాను. రవితేజ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది.
‘ఆ ఒక్కటీ అడక్కు’ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది? ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
-ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా వుటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం వుండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా వుంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం వుంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ వుంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది.
ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా ?
-సవాల్ గా అనిపించలేదు. ఎందుకంటే..నేను కూడా ఫ్రీ ఫ్లో లోనే వుంటాను. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.
ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చర్చించారు ?
-పెర్ఫెక్ట్ వైఫ్, పెర్ఫెక్ట్ హుస్బెండ్ ..అంటూ చాలా సెలెక్టివ్ గా అమారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిలకి, ఇప్పటి పెళ్లిలకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్ లో ఎలా డీల్ చేస్తారనే అంశంతో పాటు పెళ్లికి సంబధించిన అనేక అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.
నరేష్ గారు లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న హీరోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నరేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.
జాతిరత్నాలులో మంచి హ్యుమర్ వున్న పాత్ర చేశారు కదా.. ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?
-ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గా వుంటుంది. పరిస్థితుల నుంచే పుట్టే హాస్యం వుంటుంది. ఇందులో కామెడీ చాలా నేచురల్ గా పుడుతుంది. ఇందులో కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.
దర్శకుడు మల్లి అంకంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సినిమా షూటింగ్ అంతా ఫన్ గా జరిగింది.
నిర్మాతల గురించి ?
-రాజీవ్ చిలక గారు చాలా పాషన్ వున్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.
జాతిరత్నాలు 2 ఎప్పుడు ?
-ప్రస్తుతం నిర్మాతలు ‘ప్రాజెక్ట్ కె’ లో బిజీగా వున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. కల్కి కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను.
భవిష్యత్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?
-టిపికల్ హీరోయిన్ గా మాస్ మసాలా సినిమా చేయాలని వుంది. అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని వుంది. అలాగే కామెడీ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.
కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
-‘మత్తువదలరా 2’ చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని తమిళ. మలయాళం కథలు కూడా వింటున్నాను.