హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్య అందరినీ కలిచి వేసింది. ప్రియాంకారెడ్డిని దారుణంగా అత్యాచారం చేసి కిరోసిన్ పోసి దహనం చేయడం తమనెంతో బాధించిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకా రెడ్డికి నివాళి అర్పించారు. అల్లరి నరేశ్, అల్లు శిరీశ్, సుధీర్‌బాబు, వివి వినాయక్, కీర్తి సురేశ్, మెహ్రీన్ పిర్జాదా, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్ ద్వారా స్పందించారు.రోజా: హైదరాబాద్ నగర శివారులో జరిగిన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. ప్రియాంకరెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.కీర్తి సురేష్: సమాజంలో పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ప్రియాంకరెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టం. అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించింది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగివచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయో తెలియడం లేదు.రాశిఖన్నానేను కర్మను నమ్ముతానని, అది ఎల్లవేళలా పనిచేస్తుందన్న విశ్వాసం వుంది. ప్రియాంకాను హతమార్చిన నిందితులను ఉరి తీయాలి. ప్రియాంక హత్య గురించి తెలియగానే గుండె పగిలినంతపనైంది. ఆమె మృతికి తీవ్ర సంతాపం. కుటుంబానికి సానుభూతి.రష్మిక మందాన: డాక్టర్ ప్రియాంక ఘటన చూశాక మహిళలకు రక్షణ ఎక్కడుందనిపిస్తుంది? రక్షణ కావాలనుకునే మహిళలకు అవసరమయిన సాయం చేయండి. లావణ్య త్రిపాఠి: ప్రియాంక హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా చంపుతారని ఊహించలేదు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలి.మెహ్రీన్ పీర్జాదా: ప్రియాంక హత్య వార్త షాక్‌కు గురయ్యా. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలి, కఠినంగా శిక్షించాలి.దివ్యాంషా కౌశిక్: ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్‌కాల్ హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు. ‘ఈ దారుణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది?. గాయని స్మిత: ప్రాథమిక విద్యారంగం నుంచి మహిళలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. ఆడ పిల్లలతో ఎలా మెలగాలి, వారిని ఎలా కాపాడాలనే దాని గురించి బాలురకు శిక్షణ ఇవ్వాలి. ఇటువంటి చర్యలతోనే వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. సారీ ప్రియాంక. అల్లరి నరేశ్: ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతం వంటి మాటలు కూడా సరిపోవు. ప్రియాంకపై అత్యాచారం, హత్య వార్త విని చాలా బాధపడ్డాను. దేశంలో ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే భవిష్యత్తు ఉండదు. ప్రియాంక కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.సుధీర్‌బాబు: ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి.అల్లు శిరీష్: ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలి. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయి. ప్రియాంకరెడ్డికి న్యాయం జరగడానికి తోడ్పడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అదే సమయంలో మహిళలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివినాయక్: ప్రియాంకా రెడ్డి ని హతమార్చిన నిందితులను అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా శిక్షించాలి. ఈషా రెబ్బా: డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య బాగా కదిలించింది. ఆమెను చంపిన తీరు బాధాకరం. నిందితులకు కఠిన శిక్షలు పడాలి. ఈఘటన అందరికీ కదిలించింది. #RIPPriyankareddy. అనుష్క: ప్రియాంకకి జరిగింది తెలిసిన తర్వాత, ఆమెని అలా చేసిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా బాధపడతాయి. వీళ్లు మాత్రమే కాకుండా టాప్ హీరోస్, హీరోయిన్స్, సెలబ్రిటీస్ అందరూ #Justiceforpriyankareddy హ్యాష్‌టాగ్స్‌తో ప్రియాంకరెడ్డికి ట్విటర్లో నివాళి అర్పిస్తున్నారు.