రాయనపాటి లక్షి కుమారి సమర్పణలో చెర్రీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెలుగు మరియు బంజారా భాషలలో తెరకెక్కిన చిత్రం, గోర్ జీవన్. నిన్న హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో సింగర్ అండ్ ఈ సినిమా హీరోయిన్ మంగ్లీ, నటినటులు ఈ సినిమా దర్శక నిర్మాతలు పాల్గొని ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ నవంబర్ 1న బంజారా భాషలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని తెలిపారు. దీని తరువాత వెంటనే తెలుగులో కూడా విడుదల చేస్తాం అని అన్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ లుగా కెపిఎన్ చౌహన్, మంగ్లీలు నటించగా, సెకండ్ హీరోయిన్ గా వికాషినిరెడ్డి నటించారు.
ఈ సందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ… ఈ సినిమా బంజారా ప్రజల జీవిన విధానాలు, వారి సంస్కృతి సంప్రదాయాలు, వారు సమాజంలో ఎదిగేందుకు ఏర్పాటు చేసుకున్న గొప్ప విలువలు గురించి చెబుతూ మన సృష్టికి చెట్లు మరియు ఆడపిల్ల ఎంత అవసరం అనే విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పారు మా దర్శకుడు కె పి ఎన్ చౌహన్ అని కొనియాడారు. ఈ సినిమాకు సంగీతం భోలే షావలి, కెమెరా విజయ్ టాగూరు. చమ్మక్ చంద్ర, భోలే షావళి, లక్కీ స్టార్ చక్రి, జబర్దస్త్ యోధా, జాకీలు ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు రచన దర్శకత్వం కె పి ఎన్ చౌహన్, నిర్మాతలు రాయనపాటి లక్షి కుమారి, సతీష్ నాయుడు, గర్మో చౌహన్. కాగా ఈ సినిమా ఈ నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా బంజారా భాషలో విడుదల కానుంది. బంజారా భాషలో ఇంత పెద్ద స్థాయిలో విడుదల అవుతున్న తొలి సినిమాగా ఈ సినిమా చరిత్రలో మిగిలిపోతుంది అని యూనిట్ సభ్యులు తెలిపారు.