విశ్వక్ సేన్ హీరో, నాని నిర్మాత… సూపర్ కాంబినేషన్

హీరోగానే కాదు నిర్మాతగా కూడా హిట్ కొట్టగలనని అ! సినిమాతో ప్రూవ్ చేసిన నాని, ఇప్పుడు తన వాల్ పోస్టర్ బ్యానర్ పై రెండో సినిమాని మొదలుపెట్టాడు. మన ఫలకనామ దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రుహాణి శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ట్విట్టర్ ద్వారా ఈ మూవీని అనౌన్స్ చేసిన నాని, టైటిల్ పోస్టర్ ని కూడా రెలీజ్ చేశాడు. హిట్ అనే టైటిల్ తో ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ చిత్రాన్ని శైలేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న హిట్ సినిమా టైటిల్ పోస్టర్ చూస్తే ఇదో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న సినిమా అనే విషయం అర్ధమవుతుంది. విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించిన ఫలకనామ దాస్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన నాని చితా యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా అదే హీరోతో ఒక నిర్మిస్తున్నాడు. మరి విశ్వక్ సేన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న నాని, హైదరాబాదీ కుర్రాడికి కావాల్సిన కమర్షియల్ హిట్ ఇస్తాడేమో చూడాలి.