ఖాలీ పీలిగా మారిన విజయ్ దేవరకొండ టాక్సీవాలా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా టాక్సీవాలా. తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ హెరాయిన్ గా నటించిన ఈ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ హిందీలో చూడబోతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు. ముందుగా విజయ్‌ దేవరకొండతోనే ఈ సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్‌ చేస్తారన్న వార్త బయటకి వచ్చింది కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు.

తాజాగా ఈ రీమేక్‌ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. హిందీలో టాక్సీవాలా రీమేక్‌ను ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్‌, ఏఏజెడ్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఖాలీ పీలి అనే టైటిల్ ఫైనల్ చేశారు. మక్బూల్‌ ఖాన్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.