సూర్య తమ్ముడిగా తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కార్తీ… రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కాస్త దూరంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా కథని నమ్మి మాత్రమే సినిమా చేసే కార్తీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖైదీ. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ డ్రామా అనే పదాన్నే కొత్తగా చూపిస్తూ ఖైదీ ట్రైలర్ ఆకట్టుకుంది. 840కోట్ల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్న పోలీస్, అతన్ని చంపైనా ఆ డ్రగ్స్ తీసుకోవాలనుకునే రౌడి బ్యాచ్, జైల్లో పదేళ్లుగా ఉంటున్న హీరో, తండ్రి కోసం ఎదురు చూస్తూ బాల్యాన్ని గడిపేస్తున్న చిన్న పాప. ఈ నాలుగు పాయింట్స్ మధ్య డిజైన్ చేసిన కథే ఖైదీ. ట్రైలర్ లోని గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. నైట్ ఎఫెక్ట్ లో డిజైన్ చేసిన ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లారీ ఛేజ్ సీన్ ట్రైలర్ లోనే ఈ రేంజులో ఉంటే ఇక కంప్లీట్ సినిమాలో ఎలా ఉంటుందో అనే ఆలోచన కలిగించింది. ఖైదీగా కార్తీ లుక్ చాలా రగ్గడ్ గా ఉంది, తమిళ నేటివియు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఖైదీ సినిమాని తెలుగు విడుదల చేస్తారా అనేది చూడాలి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఖైదీ సినిమాలో కార్తీ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తమిళ సినీ వర్గాల టాక్. వాస్తవానికి దగ్గరగా సాగే ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఖైదీ సినిమాలో పాటలు ఉండవని.. కనీసం హీరో కార్తీకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదని అంటున్నారు. లోకేష్ కంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 26న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి కొత్త తరహా సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఖైదీ చిత్రాన్ని ఎంత వరకూ ఆదరిస్తారో చూద్దాం.