కమర్షియల్ మెసేజ్ తో కొరటాల మొదలెట్టాడు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. చిరంజీవి 152వ చిత్రమ‌ది. `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత చిరంజీవి హీరోగా.. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.

chiru 152 launch


శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌గా.. తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌
నిర్మాతలు: రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి
బ్యాన‌ర్స్‌: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎడిట‌ర్‌: శ్రీక‌ర్ ప్రసాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సురేష్ సెల్వ‌రాజ‌న్‌