నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK105, ఇంకా టైటిల్ ఫైనల్ చేయని ఈ ప్రాజెక్ట్ కి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు షేడ్స్ లో నటిస్తున్న బాలయ్య లుక్స్ లో ఒకటి ఇప్పటికే రిలీజ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో బాలయ్య అదిరిపోయాడని నందమూరి అభిమానులు ఖుషి అయ్యారు. ఇక ఈ మూవీలో బాలయ్య ఇంకో లుక్ లో కనిపిస్తాడని, రౌడీ ఇన్స్పెక్టర్ రేంజులో ఆ లుక్ ఉంటాడని నిర్మాత సి. కళ్యాణ్ ఇప్పటికే చిన్న హింట్ ఇచ్చారు కానీ లుక్ మాత్రం రివీల్ చేయలేదు. బాలకృష్ణ పోలీస్ లుక్ కి సంబంధించిన పోస్టర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తుండగా, వారిని మరింత సర్ప్రైజ్ చేస్తూ ఈ విజయదశమికి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నాడట.
సెకండ్ లుక్ పోస్టర్ ని కాకుండా ఏకంగా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు పండగ రోజున టీజర్ కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కూడా భావిస్తున్నారట. ఈ సినిమాను డిసెంబర్లో లేదా సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరాకి టీజర్ రిలీజ్ చేసి ప్రొమోషన్స్ మొదలు పెడితే రిలీజ్ సమయానికి మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. మరి దసరా పండక్కి బాలయ్య టీజర్ చేయబోయే సందడి ఏ రేంజులో ఉంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి. ఇదిలా ఉంటే ఈ మూవీకి రూలర్, గాడ్ ఫాథర్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు పవర్ఫుల్ టైటిల్సే కాబట్టి ఏది ఫిక్స్ అయినా నందమూరి అభిమానుల ఆనందానికి అడ్డు ఉండదు.