సోనమ్ కపూర్ కి కళ్లు కనిపించవా…

అనీల్ కపూర్ వారసురాలిగా తెరపై మెరిసిన సోనమ్ కపూర్, చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా నటిస్తోంది. జోయా ఫ్యాక్ట‌ర్‌ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా చేస్తున్న క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. జోయా ఫాక్టర్ అయ్యాక, సోనమ్ కపూర్ మ‌రో విభిన్న‌మైన పాత్ర‌కి ఒకే చెప్పింది. బాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఈమె ఓ కొరియ‌న్ రీమేక్‌లో న‌టించ‌నుంద‌ట‌. కొరియ‌న్ చిత్రం బ్లైండ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుజ‌య్ గోష్ రీమేక్‌ను నిర్మించ‌నున్నాడ‌ట‌. ఓ హ‌త్యానేరంలో ఇరుక్కున్న ఓ అంధురాలు త‌న నిర్దోషిత్వంతో ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేదే కాన్సెప్ట్‌. సుజ‌య్ త‌న ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన సోమ్ మ‌జికాను ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ట‌. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుంది.