రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత చేస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. టైటిల్ తోనే ఆశ్చర్య పరిచిన చిత్ర యూనిట్, తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఒక చేత్తో సగం కాల్చిన సిగరెట్ పట్టుకోని, చెరిగిన జుట్టు, పెరిగిన గడ్డం, మొహం అంతా రక్తం… ఈ ఎలిమెంట్స్ తో ఉన్న పోస్టర్ చూడగనే ఎవరికైనా షాక్ ఇవ్వడం గ్యారెంటీ. కళ్లలో బాధ, ఫేస్ లో కోపం రెండు చూపిస్తున్న విజయ్ దేవరకొండ చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలోనే బియర్డ్ లుక్ లో ఉన్నాడు అనుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ లో ఇంకా మాసీ అప్పీల్ లో కనిపిస్తున్నాడు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, క్యాథరిన్… ఇలా నాలుగు హీరోయిన్స్ ఉండడంతో వరల్డ్ ఫేమస్ లవర్ లో మల్టిపుల్ బ్రేకప్స్ కారణంగా విజయ్ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తిలా కనిపించనున్నట్లున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రవిరావు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.