మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ విడుదల

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి హారన్.వి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డీకొల్లు శ్రీధర్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : రాజశేఖర్ వర్మ, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ తదితరులు.

సాంకేతిక బృందం:

దర్శకుడు: హరి హారన్.వి
నిర్మాతలు: కె.ఎన్. రావు, రాచమళ్ళ బ్రదర్స్, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు
ప్రెజెంటర్: డీకొల్లు శ్రీధర్
బ్యానర్లు: గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్
సంగీతం: పి.ఆర్.
సినిమాటోగ్రఫీ: అశోక్
పి.ఆర్.ఓ: దినేష్ కోయ

Related Articles

Latest Articles