
వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందించిన ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్‌కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
స్టార్ డైరెక్టర్ వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘పరిణితతో సినిమాని తీసేందుకే దర్శకుడు, నిర్మాత పుట్టారనిపిస్తోంది. పరిణితకు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ ఉండబోతోంది. శరత్ గారు సినిమాని అద్భుతంగా తీసి ఉంటారని ఆశిస్తున్నాను. రజత్‌కి ఈ చిత్రంతో పేరు, డబ్బు అన్నీ వస్తాయని కాంక్షిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ .. ‘‘విజయేంద్ర వర్మ గారితో స్టేజ్ పంచుకుని 9 ఏళ్లు అవుతోంది. ఆయన నన్ను నమ్మి ‘శ్రీవల్లి’ చిత్రానికి అవకాశం ఇచ్చారు. నాకు ఈ ఐడెంటిటీని ఆయనే ఇచ్చారు. హాసినీ సెట్లో ఎంతో సరదాగా ఉంటారు. రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉంటుంది. కుటుంబ విలువల్ని చాటి చెప్పే చిత్రమిది. ప్రతీ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
దర్శకుడు శరత్ మాట్లాడుతూ .. ‘‘రజత్ నాకు మొదటి అవకాశం ఇచ్చాడు. మా మధ్య ఎనిమిదేళ్ల స్నేహ బంధం ఉంది. నేను చెప్పిన సబ్జెక్ట్ అతనికి నచ్చింది. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చాడు. నిర్మాత శరత్ గారు ఎప్పుడూ, ఎక్కడా వెనుకంజ వేయలేదు. ప్రతీ ఆర్టిస్ట్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సెట్ అంతా పిక్నిక్లా ఉండేది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు’ అని అన్నారు.
నిర్మాత డి దీపక్ మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి చిత్రం. సెట్లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేది. మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 27న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నిర్మాత వల్లే అందరికీ ఉపాధి కలుగుతుంది. డైరెక్టర్ గారు ఎంతో వేగంగా సినిమాని పూర్తి చేశారు. శరత్ గారికి ఎంతో డెడికేషన్ ఉంది. పరిణిత, బన్నీ ఇద్దరూ చక్కగా నటించారు. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
నటుడు రాకేష్ మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’కి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమా నవంబర్ 27న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
బేబీ పరిణిత మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ జర్నీలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. సెట్లో మేమంతా సరదాగా ఉండేవాళ్లం. ఈ మూవీని మీడియా ముందుకు తీసుకు వెళ్లాలి’ అని అన్నారు.
మాస్టర్ బన్నీ మాట్లాడుతూ .. ‘పిల్లలకు పేరెంట్స్ మాత్రమే ఫస్ట్ ఫ్రెండ్స్. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
తారాగణం : రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, హాసిని సుధీర్, బేబీ పరిణిత రుద్రరాజు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: వెన్నెల సిల్వర్ స్క్రీన్
నిర్మాత: డి దీపక్
రచయిత & దర్శకుడు: శరత్
సంగీతం: RH విక్రమ్
సినిమాటోగ్రఫీ: కుశ్వంత్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: మానస వర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వర్ధన్
PRO: మాడూరి మధు


