‘తండేల్’ సినిమా రివ్యూ

చందు ముండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్ర తండేల్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తూ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ఆడుకాలం నరేన్, కరుణాకరన్, దివ్య పిళ్ళై, ప్రకాష్ బెలవాడి, రంగస్థలం మహేష్, పార్వతీశం తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ఈ చిత్రం నేడు విడుదల కావడం జరిగింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ:
ఒక నిజమైన సంఘటనను ఆధారంగా తీసుకుని వాస్తవాలను కొంచెం సినిమాటిక్ లిబర్టీ మేరకు మార్పులు చేసి వచ్చిన సినిమా కాబట్టి కథ కొంచెం వాస్తవంగానే ఉంటుంది. సాయి పల్లవి (సత్య ), నాగచైతన్య (రాజు) ఒకే ఊరికి చెందిన జాలరి కుటుంబాలలోని వారు. వారిద్దరూ చిన్నప్పటినుండి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. రాజు (తండేల్) అలాగే ఆ గ్రామానికి చెందిన మరికొందరు తమ జీవనాధారం కోసం సంవత్సరంలో 9 నెలల పాటు గుజరాత్ లోని ఫిషింగ్ బోట్లలో వేటకు వెళ్తారు. కేవలం నెలకు ఒకసారి మాత్రమే ఒడ్డుకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్తూ అలా 9 నెలల పాటు గుజరాత్ దగ్గర సముద్రంలో గడుపుతారు. కేవలం మూడు నెలల మాత్రమే వారి ఊరికి వచ్చి వారి కుటుంబంతో గడుపుతారు. ఇది ఇలా ఉండగా వారు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు తుఫానులో చిక్కుకుని పాకిస్తాన్ నావి పోలీసులకు దొరుకుతారు. ఆ తరువాత వారి జీవితాలలో వచ్చిన మార్పులు ఏంటి? రాజు, సత్య కలుస్తారా? వారిని విడిపించేందుకు ఆ గ్రామస్తులు, అలాగే భారతదేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టారు? అవి ఎంతవరకు ముందుకు సాగాయి? ఆ సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య వచ్చిన పరిస్థితులలో వీరి జీవితాలు ఇటువంటి మలుపులు తిరిగాయి? చివరికి పాకిస్తాన్ జైల్లో ఉన్న వారు భారతదేశానికి తిరిగి వచ్చారా లేదా? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే వెండి ధరపై తండాల సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన అక్కినేని నాగచైతన్య ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడి తన లుక్ చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చిత్రంలో తనదైన పాత్రను తాను తప్పించి ఇంకా ఎవరు ఆ పాత్ర చేయలేరు అనంత బాగా ఆయన నటించారు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన యాస ఏదైతే ఉంటుందో దానిని ఎక్కడ కూడా తడబడకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన వారు ఎలా అయితే మాట్లాడతారో అదే విధంగా అంతే పర్ఫెక్ట్ గా మాట్లాడడం జరిగింది. సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా సినిమాలోని ఎమోషన్ సీన్స్ ఎంతో బాగా రావడానికి ముఖ్య కారణం సాయి పల్లవి అని చెప్పుకోవాలి. తన యాస అలాగే సినిమాలోని తన క్యారెక్టర్ఐజేషన్ సినిమాకు బోనస్ గా మారాయి. అలాగే చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి తమ పాత్రలకు న్యాయం చేస్తూ చాలా బాగా చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ప్రతినిధులుగా, గ్రామస్తులుగా, పాకిస్తాన్ వాసులుగా జైల్లో నటించిన వారు అంతా కూడా తమ పాత్రలకు ప్రాణం పోసి నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
చిత్ర దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రం విషయంలో ప్రతి చిన్న దానిలోను కూడా ఎంతో జాగ్రత్త పడుతూ ఈ చిత్రాన్ని తెరకు ఎక్కించారు. ఒక నిజమైన సంఘటనను ఒక సినిమా కథ రూపంలోకి మార్చి రెండున్నర గంటల సినిమాలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించడమనేది ఎంతో చాలెంజింగ్ విషయం. కానీ చందు మొండేటి ఆ విషయాన్ని గ్రహించి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని ఎలా తీసుకుని వెళ్తే వారికి అర్థమవుతుంది, ఎలా చూపిస్తే వారు కనెక్ట్ అవుతారు అనే విషయాన్ని కరెక్ట్ గా పట్టుకుని ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించడం జరిగింది. సిజిఐ వర్కులు కానీ అలాగే కొన్ని సీన్లలో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు కానీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా చూసుకున్నారు. కలరింగ్, డబ్బింగులతో పాటు చిత్రంలోని బీజం కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రంలోని సీన్లకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. లవ్ సీన్లకు తగ్గట్లు అలాగే ఎమోషనల్ సీన్లకు తగ్గట్లు బిజిఎం అందిస్తూ పాటల విషయంలో ఎక్కడ ప్రేక్షకులు అసంతృప్తి పడకుండా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిర్మాణ విలువల విషయానికి వస్తే గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం మరొక మార్క్ సృష్టించింది అని చెప్పుకోవాలి. ఎంతో విలువైన నిర్మాణ విలువలతో అలాగే శందాత్ సైనుదీన్ సరైన టేకింగ్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకుని వచ్చారు.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, దర్శకత్వం, సంగీతం, నిర్మాణ విలువలు.

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది అనిపించడం.

సారాంశం:
ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని చేసిన సినిమా కాబట్టి ప్రేక్షకులందరూ కచ్చితంగా చూసి ఆ సంఘటన ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఈ చిత్రం రూపొందింది. ఎక్కడ కూడా ఎటువంటి అడల్ట్రీ కంటెంట్ లేకుండా కుటుంబంతో కలిసి వెళ్లి చూసే విధంగా ఎంతో క్లీన్ గా ఉంది.