కమిటీ కుర్రాళ్ళు నటుడు అరెస్ట్

ఇటీవలే విడుదలైన కమిటీ కుర్రాళ్ళు చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రంలో నటించిన యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్టు కావడం జరిగింది. ప్రసాద్ బెహరా కమిటీ కుర్రాళ్ళు చిత్రంలో నటించడం కంటే ముందు నుండి యూట్యూబ్లో వివిధ సిరీస్ ద్వారా అందరికీ తెలుసు. అయితే తాను అలా నటిస్తూ వచ్చిన సిరీస్ లలో ఒక సిరీస్ కు సంబంధించిన తన తోటి మహిళ నటిని లైంగికపరమైన ఇబ్బందులు పెట్టడం వల్ల ఆమె ప్రసాద్ బెహరపై ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ బెహరాను అరెస్టు చేసి 14 రోజులు పాటు రిమాండ్ లో ఉంచినట్లు సమాచారం. అయితే ఇటీవలే ఇతను బచ్చలమల్లి సినిమాలో కూడా కీలకపాత్రలో నటించినట్లు తెలుస్తుంది.