దసరా చిత్రంతో పరిచయమైన దర్శకుడు శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ఈ చిత్రం రాబోతుంది. నాచురల్ స్టార్ నాని బ్యానర్ అయిన యునానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర పైకి తీసుకురానున్నవి. ఫ్యాన్ బాయ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కాబట్టి ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు రాబోతుంది అని అర్థమవుతుంది. ఇప్పటికే 155 సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించగా విశ్వంభర సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో ఈ చిత్ర ప్రకటన కావడం విశేషం.
అయితే ఈ చిత్రం అనౌన్స్మెంట్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్లో చూస్తే రక్తంతో తడిచిన చేతితో గూస్బమ్స్ తెప్పించే విధంగా “అతను హింసలో తన శాంతిని పొందుతాడు” అనే ఒక లైన్ తో ఉంది. భారీ తారాగణంతో చిరంజీవి గారు ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ తో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. భారీ బడ్జెట్ తో గొప్ప టెక్నికల్ విలువలతో ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇండియన్ స్క్రీన్ పైన ఇంతవరకు ఎవరు ఊహించని మలుపులతో క్రేజీ ప్రాజెక్టుగా ఈ చిత్రం రాబోతుంది అని మేకర్స్ తెలియజేశారు.