యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో లో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్య లేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్ గా వుండబోతున్నాయి.
శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
దీని స్ఫూర్తితో, టీమ్ సినిమా కోసం అద్భుతమైన, మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను చిత్రీకరీంచింది. మ్యాసీవ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో అద్భుతమైన శివరాత్రి సాంగ్ ని గ్రాండ్ గా స్కేల్ లో షూట్ చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ ఒక టైమ్‌లెస్ క్లాసిక్ సాంగ్ ని కంపోజ్ చేసారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, వేలాది మంది డ్యాన్సర్లతో కలిసి అద్భుతంగా అలరించారు. ఈ శివరాత్రి పాట ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ లతో నాగ చైతన్య కెరీర్లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా వుండబోతోంది. ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను మేకర్స్ విడుదల చేసారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ డ్యాన్సర్లతో పాటు డ్యాన్స్ చేస్తూ సంప్రదాయ దుస్తులలో కనిపించారు. పోస్టర్లు హై ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేశాయి.
ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు.
తండేల్ మూవీ పాన్ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో