ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమా రివ్యూ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రముఖ పాత్రలో వచ్చిన సినిమా కల్కి 2898AD. అశ్విని దత్ నిర్మాతగా వైజయంతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, దిశా పటాని అలాగే కమల్ హాస్సన్, దుల్కర్ సలీమాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం అలాగే RGV, రాజమౌళి గెస్ట్ రోల్స్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాకుండా సినిమా అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు ఎదురుచూసారు. ఈ సినిమా రివ్యూ విషయానైకి వస్తే…

కథ :
నాగ్ అశ్విన్ ముందు నుండి చెప్పినట్లుగానే సినిమా కాళీ యుగాంతం సమయంలో జరిగే యుద్ధంలాగానే అనిపిస్తుంది. దీపికా పాడుకొనే ఎవరు? ప్రభాస్ కి దీపికా పాడుకొనెకు సంబంధం ఏంటి? అమితాబ్ బచ్చన్ ఎందుకు దీపికా పండుకొనెను కాపాడాలి అనుకుంటాడు. అసలు వాళ్ళు అంత ఎక్కడ ఎప్పుడు ఎలా కలుస్తారు? వీటి చుటూ తిరుగుతుంది సినిమా. దీపికా పాడుకొనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడటం చుట్టూ కథ తిరుగుతుంది. అసలు కాంప్లెక్స్ అంటే ఏంటి? అక్కడ ఎం ఉంటుంది? అక్కడికి ప్రభాస్ ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు? వీటి చుట్టూ సినిమా ఉంటుంది.

నటన:
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు తగ్గ న్యాయం చేసారు. కొత్త మంది గెస్ట్ రోల్స్ మాత్రమే చేసినప్పటికీ సినిమాకు ఆ పాత్రలు మంచి ఎఫెక్ట్ ఇచ్చాయి. అలాగే సినిమాకు తగ్గట్లు పాత్రలను చేసేలా నటీనటులను ఈ సినిమాలో ఉపయోచుకున్నారు నాగ అశ్విన్. అమితాబ్ బచ్చన్ క్యారక్టర్ ఆయన తప్పించి వేరే వారు చేయలేరు అనేలా ఉంది.

సాంకేతిక విశ్లేషణ:
సినిమా చాలా గ్రాండియర్ గ అనిపించింది. దర్శకత్వం, స్క్రీన్ప్లే చాలా బాగా అనిపించాయి. సినిమాకు తగ్గ మ్యూజిక్ ఉంది బ్యాక్ గ్రౌండ్లో. బుజ్జికి తగ్గట్లు bgm ఇచ్చారు. గ్రాఫిక్స్ ఇంకా vfx తో సినిమా చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చారు.

సినిమాలో బుజ్జికి తనకంటూ ప్రత్యేకత ఉండేలా, అలాగే సినిమాలో ప్రభాస్ కార్ ప్రాముఖ్యత ఉండేలా నాగ అశ్విన్ జాగ్రత్త పాడారు. సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొంచం లాగ్ అనించినప్పటికీ పూర్తిగా చూసుకుంటే బావుంది. సినిమాలో ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ మధ్య ఆక్షన్ సీన్స్ హైలైట్ అని చెప్పుకోవాలి.

ఒక్కమాటలో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. భారత సినిమా స్థాయిని పెంచి హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా ఉంది.