వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా కొత్త అప్డేట్ – బయట పడ్డ వరుణ్ తేజ్ వింటేజ్ లుక్

వరుణ్ తేజ్ కథానాయకుడుగా మీనాక్షి చౌదరి కథానాయకురాలుగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫటేహి కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమా మట్కా. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మిమే గోపి, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి జంటగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బన్నెర్స్ పై ఈ సినిమా వస్తుంది. కిషోర్ కుమార్ ఈ సినిమాకు డిఓపి గా చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి కొత్తగా ఒక అప్డేట్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమా మూడవ విడత షూటింగ్ హైద్రాబాద్ లో చాలా వేగంగా జరుగుతుంది అని అన్నారు. ఈ చిత్రంలో వైజాగ్ నగర వింటేజ్ రోజులలో జరుగబోతున్నట్లు చెప్పారు. దానికి సంబందించిన సెట్స్ RFC లో వేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబందించిన ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.