దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదగా “శబరి” సినిమాలోని ‘అలిసిన ఊపిరి…’ సాంగ్ లాంచ్

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది.

తాజాగా సినిమాలోని ‘అలిసిన ఊపిరి…’ పాటను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మట్కా’ తెరకెక్కిస్తున్న కరుణ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో రెహమాన్ రాసిన ‘అలిసిన ఊపిరి…’ పాటను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

పాట విడుదల చేసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ… ”అందరికీ నమస్తే. ఇప్పుడే మహేంద్రనాథ్ గారు నిర్మించిన ‘శబరి’ సినిమాలోని ‘అలిసిన ఊపిరి’ సాంగ్ విడుదల చేశా. రెహమాన్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాట చాలా బావుంది. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకుని థ్రిల్లర్ సినిమా చేశామని చెప్పారు. నాకు మహేంద్రనాథ్ గారితో మంచి అనుబంధం ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి వర్సటైల్ యాక్టర్ ఈ సినిమా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథలు తక్కువగా వస్తున్న ఈ రోజుల్లో మంచి కథతో సినిమా తీశారు” అని చెప్పారు.

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ… ”సాంగ్ రిలీజ్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్స్. ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా ‘శబరి’ సినిమాను మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్, ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తల్లి కూతుళ్ల నేపథ్యంలో స్ట్రాంగ్ ఎమోషన్స్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం:
రచనా సహకారం: సన్నీ నాగబాబు

పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్

మేకప్: చిత్తూరు శ్రీను

కాస్ట్యూమ్స్: అయ్యప్ప

కాస్ట్యూమ్ డిజైనర్: మానస

స్టిల్స్: ఈశ్వర్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి

కో- డైరెక్టర్: వంశీ

ఫైట్స్: నందు – నూర్

కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ

ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల

సంగీతం: గోపి సుందర్

సమర్పణ: మహర్షి కూండ్ల

ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల

కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్