శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వేయి శుభములు కలుగు నీకు`. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాటకు మిలియన్స్ లో వ్యూస్ లభించాయి. ఇటీవల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్‌ను ప్రముఖ నటుడు శివాజీరాజా విడుదల చేశారు.
ఈ పాటకూ శ్రోతల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ...
చాలా పాజిటివ్ టైటిల్. సినిమా అంతా కూడా అదే పాజిటివ్ తో జరిగింది. దీనికి కారణం నిర్మాతలు. ఎంతో మంది నిర్మాతలను చూశాను నా కెరీర్ లో కానీ వీరు మనసు పెట్ట్టి సినిమా తీశారు. అందరూ అలాగే పని చేశారు. పాటలు, ఫైట్స్ చాలా బాగున్నాయి. గ్యానీ కి ఈ చిత్ర టీమ్ కి , దర్శకుడికి నా అభినందనలు. అనుకున్న బడ్జెట్ లో రాజీ పడకుండా అనుకున్న విధంగా తీశారు. అందరూ కలిసి మెలిసి పని చేశారు.ఈ ఐటమ్ సాంగ్ లో ఫాల్గుణి, విజయ్ రాజా అద్భుతంగా నర్తించారు. ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేశానుఅన్నారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ...
ఐటమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా నిర్మాతలు ఎంతో కష్టపడి, ఖర్చుపెట్టి సినిమా తీశారు. దర్శకుడు ఎంతో హార్డ్ వర్క్ చేశారు సినిమా కోసం. డాన్సర్ ఫాల్గుణి తో పాట చేయడం హ్యాపీ. గ్యానీ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారుఅన్నారు. నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ "మా చిత్రానికి అద్భుతమైన టెక్నిషన్స్ పని చేసారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు గ్యాని గారు ఇచ్చిన పాటలు సినిమాకు హైలెట్ . హీరో విజయ్ రాజా ఎంతో డెడికేటెడ్‌గా సినిమా చేస్తూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే శివాజీ రాజా గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దర్శకుడు సినిమాను అనుకున్న దానికన్నా బాగా తీశారు. ప్రేక్షకులు మా చిత్రాన్నిఆదరిస్తారని కోరుకుంటున్నా
అన్నారు.
నటి ఫాల్గుణి మాట్లాడుతూ…గ్యాని గారు మంచి బీట్స్ తో సాంగ్ ఇచ్చారు. విజయ్ రాజా గారితో సాంగ్ చేయడం చాలా హ్యపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు`` అన్నారు. మరో నిర్మాత జామి శ్రీనివాస రావు మాట్లాడుతూ... ``విజయ్ రాజా చాలా బాగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉంటుంది`` అన్నారు. పాటల రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ...
ఇప్పటి వరకు నేను లవ్ సాంగ్స్ రాశాను. ఈ సినిమాలో తొలిసారిగా మాస్ సాంగ్ రాశానుఅన్నారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ " మా చిత్రానికి సంగీత దర్శకుడు గ్యాని సింగ్ మంచి పాటలు అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మిలియన్ కు పైగా వ్యూస్ లభించాయి. అలాగే కత్తి ఖతర్నాక్ సాంగ్ కి కూడా రెస్పాన్స్ బావుంది. ట్రెండింగ్ లోకి వెళ్తుంది. హీరో విజయ్ రాజా గారు ఎంతో డెడికేటెడ్‌గా పని చేస్తున్నారు. సాంగ్స్ , ఫైట్స్ ఇరగదీశారు. శివాజీ రాజా గారి ఎంకరేజ్మెంట్ మరువలేనిది. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడరకండా నిర్మిస్తున్నారు. ఫాల్గుణి , విజయ్ రాజా ఈ మాస్ సాంగ్ లో మతిపోయే స్టెప్స్ వేశారు
అన్నారు.
విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్,షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిశోర్ కుమార్
ఎడిటర్ :వినోద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
నిర్మాతలు : తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్