దగ్గుబాటి రానాని లాంచ్ చేస్తూ ఫీల్ గుడ్ సినిమాల డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లీడర్. ఒక్క చుక్క రక్తం కార్చకుండా, ఒక్క ఫైట్ లేకుండా, ఒక ఐటమ్ సాంగ్ లేకుండా తెలుగు సినీ చరిత్రలో వచ్చిన ఏకైక పొలిటికల్ డ్రామా లీడర్ సినిమా మాత్రమే. విమర్శకుల ప్రశంశలు పొందిన ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి మరో కమర్షియల్ సినిమా రాలేదు. ప్రస్తుతం నాగ చైతన్య సాయి పల్లవితో లవ్ స్టొరీ సినిమా చేస్తున్న శేఖర్ నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో అనౌన్స్ చేశాడు. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన ధనుష్ లాంటి హీరోతో ట్రైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ ఏ అందరికీ షాక్ ఇచ్చింది. ధనుష్ ఇమేజ్ ని శేఖర్ కమ్ముల బాలన్స్ చేయగలడా అనే అనుమానం అందరిలోనూ మొదలయ్యింది.
ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అవన్నీ ఓకే అసలు ఏ నేపధ్యంలో సినిమా రాబోతుంది, ధనుష్ అభిమానులని శేఖర్ కమ్ములా ఎలా మెప్పిస్తాడు అని అంతా ఆలోచిస్తూ ఉండగా… ఒక న్యూస్ బయటకి వచ్చి చాలా డౌట్స్ ని క్లారిఫై చేసింది. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకేక్కబోతుందట. పొలిటికల్ టచ్ ఉన్న కథతో ధనుష్ ఆల్రెడీ కొడి డబుల్ యాక్షన్ సినిమా చేశాడు. అయితే ఇది కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్ళే సినిమా. శేఖర్ కమ్ముల పొలిటికల్ డ్రామా అంటే అందరికీ లీడర్ సినిమాని తను హ్యాండిల్ చేసిన విధానమే గుర్తొస్తుంది. ఆ సినిమాని సక్సస్ ఫుల్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చేలా చేసిన శేఖర్ కమ్ముల, ఈ పొలిటికల్ డ్రామాలో కూడా ధనుష్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాడు అనే కాన్ఫిడెన్స్ కి వచ్చారు.