నరేష్ నాంది… బాలీవుడ్ వెళ్తుంది…

టాలీవుడ్ లో మంచి విజయం సాధించి అల్లరి నరేష్ కి కంబాక్ హిట్ గా నిలిచిన సినిమా ‘నాంది’. కోర్ట్ రూమ్ డ్రామాలోని ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి హిట్ ఇచ్చేలా చేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలని వెతికి మరీ రీమేక్ చేసే బాలీవుడ్ వర్గాలు, నాంది మూవీని హిందీలో తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందదుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ‘నాంది’ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించగా దిల్ రాజు ముందుండి ప్రమోట్ చేశాడు. హీరో అల్లరి నరేశ్, ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో విజయవంతమైన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ‘నాంది’ బాలీవుడ్ రీమేక్ లో ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ హీరోగా నటించనున్నారు. ‘నాంది’ సినిమా బాలీవుడ్ రీమేక్ పై అజయ్ దేవగణ్ స్పందించారు. 

తెలుగు వర్షెన్ ఎంతో అద్భుతంగా ఉందని, ఈ సినిమా తన మనసుకు తాకిందని, దీంతోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తానని అజయ్ దేవగణ్ తెలిపారు. పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో సింగం, సన్ ఆఫ్ సర్దార్, దృశ్యం సినిమాలని రీమేక్ చేసిన అజయ్ దేవగన్ ఈ కోర్ట్ రూమ్ డ్రామాతో కూడా హిట్ కోడతననే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, మైదాన్, మే డే సినిమాలని చేస్తూ బిజీగా ఉన్న అజయ్ దేవగన్… ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవగానే నాంది సినిమాని మొదలు పెట్టే అవకాశం ఉంది.