కన్నడలో విజయవంతమైన మనె తుంబిద హెణ్ణ(1958) చలనచిత్రం ఆధారంగా కొన్ని మార్పులుచేర్పులతో విజయావాహిని ప్రొడక్షన్స్ పతాకంపై కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మన పెద్దాయన ఎన్టీ రామారావు, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, జమున, యస్వీ రంగారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రాజనాల, ఛాయాదేవి, హరనాధ్, ఎల్.విజయలక్ష్మి, అల్లు రామలింగయ్య, హేమలత ప్రధాన తారాగణంగా బి.నాగరెడ్డి-ఎ.చక్రపాణి గారి నిర్మాణ సారధ్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం నిర్వహించిన “లేచింది నిద్రలేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం”, “కోలు కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడి”, “వేషము మార్చెనూ భాషను మార్చెనూ మోసమూ నేర్చెను”, “అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు” లాంటి పింగళి నాగేంద్రరావు గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, డి.వి.నరసరాజు గారి పదునైన సంభాషణలు, మార్కస్ బార్ట్లీ గారి అద్భుతమైన ఛాయాగ్రహణం, జి.కళ్యాణసుందరం-డి.జి.జయరాం గార్ల నేర్పైన కూర్పుతో కథాగమనాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ అసలు తెలుగుపదమే కాని గుండమ్మ పేరును తెలుగులో గయ్యాళితనానికి ప్రతీకైన పాత్రగా మలచి హాస్యం, సంగీతం ప్రధానంగా సాగిన యీ కుటుంబ కథాచిత్రం యొక్క ప్రివ్యూ ప్రదర్శనకు విచ్చేసిన ప్రముఖుల విమర్శలు, పెదవివిరుపుల మధ్య విడుదలై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, అశేష ప్రేక్షకాదరణతో 19 కేంద్రాల(15 డైరెక్ట్+ 4 లేట్ రిలీజ్ డైరెక్ట్)లో 100 రోజులు ప్రదర్శింపబడడం, అప్పటివరకూ 2 ఆటలు మాత్రమే ప్రదర్శింపబడే హైదరాబాద్ – ప్రభాత్ థియేటర్లో మొట్టమొదటిసారిగా 3 ఆటలతో 105 రోజులు(డైరెక్ట్) గా ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించడం, మన పెద్దాయన ఎన్టీ రామారావు గారి నటకిరీటంలో యిది 100 వ చిత్రం కావడం, విజయవాడ – దుర్గాకళామందిర్ -175 రోజులు(డైరెక్ట్) ప్రదర్శింపబడి రజతోత్సవ వేడుకలు నిర్వహించకుండా ఆ మొత్తాన్ని అప్పట్లో చైనాతో యుద్ధం చేస్తున్న మన భారత సైన్యం యొక్క సహాయనిధికి విరాళంగా అందజేయడం విశేషం..