ఎపిసోడ్ 1: Exile: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 శ్రీలంకలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ తమిళ ప్రజల కోసం పోరాడే భాస్కరన్, అతని తమ్ముడు సుబ్బు, పొలిటికల్ ఫైటర్ దీపన్ ఇంట్రడక్షన్ తో సిరీస్ మొదలవుతుంది. ఈ ముగ్గురు తమ స్థావరంలో ఒక ఆయుధాన్ని టెస్టింగ్ చేసే సమయంలో శ్రీలంకన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. దీంతో భాస్కరన్ అతని అనుచరుడు దీపన్, తమ్ముడు సుబ్బుతో సహా పారిపోతాడు. భాస్కరన్ దీపన్ లండన్ వెళ్లిపోగా, సుబ్బు మాత్రం చెన్నైలో ఈలం కోసం రాజకీయ నాయకుల నుంచి మద్దతు కూడగట్టే పనిలో పడతాడు. శ్రీలంకన్ ఆర్మీ భాస్కరన్ ని ట్రేస్ చేసే పనిలో పడగా…
శ్రీలంకలో పోర్ట్ కట్టడానికి చైనా ప్రయత్నాలు చేయడం మొదలుపెడుతుంది. చైనా శ్రీలంకలోకి అడుగు పెడితే ఇండియన్ ఓషన్ పై ఇండియా పట్టుకోల్పోయినట్లే, ప్రపంచ దేశాలు ఇండియాని చూసి నవ్వుతాయని భావించిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బసు శ్రీలంకన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరుపుతుంది. లంకలో ఇండియా పోర్ట్ కట్టడానికి లంక ప్రెసిడెంట్ ఒప్పుకుంటాడు కానీ భాస్కరన్ తమ్ముడు సుబ్బుని పట్టించమని అడుగుతాడు. చేసేదేమి లేక ప్రైమ్ మినిస్టర్ బసు సుబ్బుని వాళ్లకి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.
సుబ్బుని పట్టుకోవడానికి టాస్క్ టీం ప్రిపేర్ అవుతుంటే, టాస్క్ వదిలేసిన శ్రీకాంత్ మాత్రం ఐటీ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి నచ్చని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీతో కావాల్సినంత సమయం గడుపుతూ ఉంటాడు కానీ సూచీ(ప్రియమణి) మాత్రం శ్రీకాంత్ తో కలిసి సంతోషంగా ఉండలేక పోతుంది. కుటుంబ సమస్యని తీర్చుకోవడానికి కౌన్సిలర్ కూడా కలవడానికి వెళ్తారు. గన్నులు పట్టుకునే తిరిగే శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో కూర్చోని సిస్టమ్ ఆపిరేట్ చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. శ్రీకాంత్ కూతురు దృతి కళ్యాణ్ అనే అబ్బాయి ప్రేమలో ఉంటుంది. రోజు అతన్ని కలుస్తూ తిరుగుతూ ఉంటుంది.
తమిళ టాస్క్ టీమ్ సుబ్బు ఉన్న బిల్డింగ్ ని చుట్టుముట్టి, అతన్ని పట్టుకుంటారు. ఈ సమయంలో కొందరు ఆఫీసర్స్ కూడా మరణించడంతో సుబ్బుని టాస్క్ ని టీమ్ కోర్ట్ లో సబ్మిట్ చేయాలనుకుంటారు. ఇండియాపై దాడి చేయడానికి ఆత్రుత ఎదురు చూస్తున్న isi ఏజెంట్ సమీర్, సుబ్బుని చంపడానికి సాజిద్ ని ఇండియా పంపిస్తాడు. ఇండియా వచ్చిన సాజిద్, అనుకున్నట్లుగానే సుబ్బుని చంపే ప్లాన్ మొ సక్సస్ ఫుల్ గా ఎక్సిక్యూట్ చేస్తాడు. సుబ్బు మరణంతో ఎపిసోడ్ 1 ముగుస్తుంది.
ఇంట్రెస్టింగ్ నోట్ లో సిరీస్ ని ఓపెన్ చేసి మొదటి నాలుగున్నర నిమిషాల పాటు సింగల్ టేక్ సీన్ తో ఇంటెన్సీటీని క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. సుబ్బు చనిపోవడం ఎపిసోడ్ 1కి టర్నింగ్ పాయింట్. ఇండియన్ గవర్నమెంట్ సుబ్బు డెత్ కి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయబోతుంది అనే క్యూరియాసిటీని మైంటైన్ చేశాడు. ఇక టాక్స్ వదిలేసిన శ్రీకాంత్ తనకి నచ్చని పని చేస్తూ కూడా అతని మాజీ సహచరులతో టచ్ లో ఉండడం అతనిలో ఉన్న ఆ పెయిన్ ని తెలిసేలా చేసింది. సూచిగా ప్రియమణి జాబ్ కి రిసైన్ చేసి ఇంటికే పరిమితం అయ్యింది. ఈ ఇద్దరి మధ్య ఒద్దిక కుదరకపోవడం ఇంట్లో సమస్యలు చూపించారు. ఎపిసోడ్ 1లో సమంత ఇంట్రడక్షన్ మాత్రం రాలేదు.