ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫుల్ స్టోరీ ఇదే

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ లో ఒకటైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ అయ్యింది. కథ పరంగా చూస్తే… శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోసం పోరాడుతున్న భాస్కరన్, దీపన్, సుబ్బుపై ఎటాక్ జరుగుతుంది. ఈలం కోసం పోరాడుతున్న సంస్థపై దేశాలు నిషేధం విధించడంతో భాస్కరన్, దీపన్ లు లండన్ వెళ్లి అక్కడి నుంచి విదేశాల మద్దతు కూడగొట్టే పనిలో పడతారు. భాస్కరన్ తమ్ముడు సుబ్బు చెన్నై వచ్చి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలని కూడగట్టి పార్లమెంట్ లో తమ గొంతు వినిపించేలా చేయాలని నాయకులని కలుస్తూ ఉంటాడు. ఇదే సమయంలో శ్రీలంకలో ఒక పోర్ట్ కట్టడం కోసం చైనా శ్రీలంకన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరుపుతూ ఉంటుంది. చైనాని శ్రీలంకలోకి అడుగు పెట్టనివ్వడమే అని భావించిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బసు, శ్రీలంకన్ ప్రెసిడెంట్ తో మాట్లాడి ఇండియా ఆ పోర్ట్ నిర్మించడానికి ఒప్పిస్తుంది. దీనికి బదులుగా శ్రీలంక ప్రెసిడెంట్ చెన్నైలో ఉన్న సుబ్బుని పట్టి ఇవ్వమని అడుగుతాడు. దీంతో చేసేదేమి లేక టాస్క్ టీంని సుబ్బుని పట్టుకోవడం కోసం పంపిస్తారు. ఈ క్రమంలో సుబ్బు తమిళనాడు టాస్క్ టీం పై ఎటాక్ చేస్తాడు. ఎట్టకేలకు అతన్ని పట్టుకోని కోర్ట్ లో ప్రవేశ పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ సిద్ధపడుతుంది. ఇండియాపై ఎటాక్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న isi, భాస్కరన్ తో చేతులు కలిపి అతని తమ్ముడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సాయం చేయడానికి వస్తాడు. సుబ్బు మరణంతో కుంగిపోయిన భాస్కరన్ దానికి కారణం అయిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బసుపై ఎయిర్ ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ మిషన్ ని పూర్తి చేయడానికి భాస్కరన్, తమిళ టైగర్ ఎయిర్ ఫైటర్ అయిన రాజిని ఎంచుకుంటాడు. భాస్కరన్ మిషన్ గురించి తెలిసుకున్న ఇండియన్ ఫోర్సెస్, బసుని కొన్ని రోజులు పబ్లిక్ మీటింగ్స్ కి దూరం ఉండమని హెచ్చరిస్తాయి. స్వతహాగా మొండిది అయిన బసు, సుబ్బు చనిపోయిన చెన్నైలోనే శ్రీలంక ప్రెసిడెంట్ తో పోర్ట్ బిల్డ్ చేసే ఒప్పందాన్ని సైన్ చేస్తాను. నా భాద్యత, శ్రీలంక ప్రెసిడెంట్ భాద్యత మీరే చేసుకోండి అంటూ టాస్క్ కి స్ట్రెయిట్ గా చెప్పేస్తుంది. చేసేదేమి లేక టాస్క్ హెడ్ కులకర్ణి తన బెస్ట్ టీంని టాస్క్ ఆఫీసర్ అయిన శ్రీకాంత్ కి ఇచ్చి చెన్నై పంపిస్తాడు. శ్రీకాంత్ ఆల్మోస్ట్ రాజీని పెట్టుకుంటున్నాడు అనుకున్న టైములో అతను అక్కడ ఉంటే మిషన్ కంప్లీట్ కాదు అని తెలుసుకున్న isi శ్రీకాంత్ కూతురు దృతికి కిడ్నప్ చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైలోని మిషన్ ని వదిలేసి శ్రీకాంత్ ముంబై వచ్చేస్తాడు. ఇదే సమయంలో రాజి బసుపై ఎటాక్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంది. అక్కడి నుంచి శ్రీకాంత్, రాజిని ఎలా ఆపాడు? ఇండియా శ్రీలంక పోర్ట్ అగ్రిమెంట్ అయ్యిందా లేదా? ఫారిన్ వెళ్లిన భాస్కరన్ తిరిగి వచ్చాడా రాలేదా? అనేదే ది ఫ్యామిలీ మ్యాన్ 2 కథ.

మనోజ్ బాజ్పాయ్ ఎప్పటిలాగే శ్రీకాంత్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రాజి పాత్రలో సమంత ఈజ్ ఏ ట్రీట్ టు వాచ్ ఆన్ స్క్రీన్, తన మేకోవర్ చాలా బాగుంది. తమిళ టైగర్ గా సమంత యాక్టింగ్ విల్ స్టుడ్ ఫర్ ఏ లాంగ్ టైం. మిగిలిన పాత్రల్లో కనిపించిన వాళ్లందరూ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఎపిసోడ్ వైజ్ రివ్యూ కోసం కీప్ ఫాలోయింగ్ అవర్ ఫ్యూచర్ పోస్ట్స్.