సాటి మనిషికి సాయం చేయడాన్ని ఒక బాధ్యతగా తీసుకోని పని చేసే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుటాడు. దాదాపు వెయ్యి మంది పిల్లలకి పైగా హార్ట్ సర్జరీస్ చేయించిన మహేశ్… మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ టీకాలను ఇప్పించారు. ఈ డ్రైవ్ స్పాన్సర్ చేసిన మహేశ్ తండ్రికి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యింది.
శ్రీమంతుడు సినిమా తర్వాత ఈ బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ అప్పటి నుంచి గ్రామ అభివృద్ధిని, ఊరి అవసరాలని తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కరోనా కారణంగా ఇబ్బంది తలెత్తడంతో ప్రజలకు సాయం చేసి, వారి ఆశీర్వాదాలు తండ్రికి ఎల్లప్పుడూ ఉండేలా మహేశ్ బాబు చాలా కాస్ట్లీ గిఫ్ట్ ను ఇచ్చారని చెప్పవచ్చు. తెలంగాణలో కూడా సిద్ధాపురం అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న మహేశ్, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రియల్ లైఫ్ లోనూ అసలైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. ఎంతైనా సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతని ఇంటికి పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే అంత గొప్ప మనసున్న తండ్రికి పుట్టిన వాడు ఇలా కాకుండా ఇంకెలా ఉంటాడు చెప్పండి.