దర్శక దిగ్గజం రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలియా భట్ అజయ్ దేవగన్… ఆన్ కార్డ్స్ చూస్తేనే ఈ సినిమా రిజల్ట్ ఏ రేంజులో ఉండబోతుందో మనం ఊహించొచ్చు. ట్రిపుల్ ఆర్ రేంజ్ ఏంటో రిలీజ్ తర్వాత తెలుస్తుంది అని చాలా మంది అన్నారు కానీ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ని ఆన్ సెట్స్ ఉండగానే ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఇంకా పూర్తిగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోని ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ అండ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కి డీల్ క్లోజ్ చేశారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.325 కోట్లకు జీ5 కొనుగోలు చేసింది. హిందీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది మాత్రమే కాకుండా ఎంటైర్ రైట్స్ డీటైల్స్ ని ఒక దెగ్గర పెడుతూ పెన్ ఇండియా లిమిటెడ్ ఒక వీడియో పోస్ట్ చేసింది. అది చూసేయండి ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఏ లాంగ్వేజ్ లో ఎక్కడ చూడొచ్చు అనే క్లారిటీ వచ్చేస్తుంది.