కళ్యాణ్ రామ్ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్

ప్రొడ్యూసర్ గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్, హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మే 28 నందమూరి తారక రామారావు పుట్టిన రోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ టైం ట్రావెల్ కాసెప్ట్ తో రానుంది. సోషియో ఫాంటసీ, టైం ట్రావెల్ లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో కళ్యాణ్ రామ్ సినిమా చేయడం నందమూరి అభిమానులని ఖుషి చేసే విషయం. కెరీర్ మొత్తం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ వస్తున్న కళ్యాణ్ ఈ ఎక్స్పరిమెంట్ మూవీతో ఎలాంటి సక్సస్ అందుకుంటాడో చూడాలి. కళ్యాణ్ రామ్ 18వ సినిమాగా సెట్స్ పై ఉన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మే 28న మధ్యాహ్నం 12 గంటలకి విడుదల కానుంది.