కరోనా మనకి దెగ్గరైన మనుషులని దూరం చేస్తూ ఉంది. ప్రతి కుటుంబాన్ని కుదిపేస్తున్న ఈ కరోనా విషాదం సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంటిని కూడా ఇబ్బంది పెట్టింది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ చనిపోయారు. వర్మ తెలిసిన వాళ్లకి, వర్మతో పని చేసిన వాళ్ళకి సోమశేఖర్ చాలా పరిచయస్తుడ. చిన్నప్పటి నుంచి తనకి అండగా నిలిచిన అన్న చనిపోవడంతో వర్మ చాలా బాధపడ్డారు. తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో అన్న సోమశేఖర్ ఒకరని పలు సందర్భాల్లో వర్మ స్వయంగా చెప్పారు. రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించిన సోమశేఖర్, ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకత్వం కూడా వహించారు.
సరిగ్గా 48 గంటల క్రితం వర్మ ట్విట్టర్ లో, గత నెల రోజుల్లో తనకి తెలిసిన లేదా తనకి తెలిసిన వాళ్లల్లో కనీసం 5-6 మంది చనిపోయారు. కరోనా మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అబద్దం చెప్తుందా లేక మరణాల విషయంలో మనుషులు అబద్దం చెప్తున్నారా అని ట్వీట్ చేశాడు. ఏ కరోనా విషాదం గురించి వర్మ మాట్లాడారో అదే విషాదం 48 గంటలు తిరగక ముందే వర్మ ఇంట్లో జరగడం బాధాకరం.