నెమలి నాట్యం చేస్తుంది…

మలర్ సాయి పల్లవి లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ కరోనా కారణంగా ఆగిపోయింది. థియేటర్స్ ఓపెన్ అయితే విడుదలకి సిద్దమైన ఈ సినిమా నుంచి ఫిబ్రవరి 28న సారంగ దరియా సాంగ్ బయటకి వచ్చింది. తెలంగాణ సెన్సేషన్ మంగ్లీ గొంతు, శేఖర్ కమ్ముల ఖోరియోగ్రఫి, సాయి పల్లవి డాన్స్ ఈ సాంగ్ ని ఇన్స్టాంట్ హిట్ గా నిలబెట్టాయి. నెమలి నాట్యం చేసినట్లు కదిలే సాయి పల్లవి, పట్టుపరికిణిలో అద్భుతంగా డాన్స్ చేసింది. అందుకే సారంగ దరియా సాంగ్ ని చూడడానికి సాంగ్ లవర్స్ రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. మిలియన్ వ్యూస్ రాబడుతున్న సారంగ దరియా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ రాబట్టి ఈ ఇయర్ సెన్సేషన్ గా మారింది. జానపద పాట కాపీ కొట్టారు అనే కాంట్రవర్సీ కూడా సారంగ దరియా వ్యూస్ కి హెల్ప్ అయ్యాయి.

సాయి పల్లవికి యూట్యూబ్ రికార్డ్స్ కొత్త కాదు, ఫిదాలోని వచ్చిండే పాట కూడా యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ధనుష్ తో సాయి పల్లవి నటించిన మారి 2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ కూడా యూట్యూబ్ సెన్సేషనే. 1.15 బిలియన్ వ్యూస్ రాబట్టిన రౌడీ బేబీ సాంగ్స్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ వీడియోస్ లో ఒకటిగా నిలిచింది. ఇలా సాయి పల్లవి సూపర్ డాన్స్ చేసిన ప్రతిసారీ అదో సెన్సేషన్ అవుతుంది.