ఎక్కడో పల్లెటూరులో ఒకరికి ప్లాస్మా కావాలి, అవసరంలో ఉన్న వాళ్లకి గుర్తొచ్చే పేరు సోను సూద్. మరెక్కడో ఆక్సిజన్ కావాలి అక్కడి వాళ్ళకీ గుర్తొచ్చే పేరు సోను సూద్… ఇంకెక్కడో హాస్పిటల్ బెడ్స్ కావాలి వాళ్ళకీ సోను సూదే గుర్తొస్తాడు. ప్రభుత్వాలు, నాయకులు, ప్రజా సంఘాలు ఇలా అన్నీ కరోనా భాదితులని ఆదుకోవడానికి కష్ట పడుతున్న సమయంలో సోను సూద్ ఒక్కడై అందరికీ అండగా నిలుస్తున్నాడు. సినిమాటిక్ భాషలో చెప్పాలి, హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వాలి అంటే… Sonu Sood is running a parallel government to help the people in need.
ఒక్కడే ఇంత చేయగలడా? చేస్తున్నాడు కదా మరి సందేహం ఎందుకు. ఎవరికీ సాధ్యం కానిది సోను సూద్ చేసి చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ బస్సులు, ఫ్లైట్ లు, బ్లడ్, ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లుకే పరిమితం అయిన సోను సూద్, ఇప్పుడు మరో అడుగు ముందుకి వేసి ఆక్సిజన్ ప్లాంట్ స్థాపించడానికి సిద్ధం అయ్యాడు. ఆక్సిజన్ లేక చనిపోతున్న రోగుల ఏడుపులు వినిపించాయో లేక వారి కుటుంబాల తాలూకు కష్టాలు కదిలించాయో తెలియదు కానీ ఆక్సిజన్ లేక ఇకపై నా దేశంలో ఎవరూ మరణించకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నాడు. ఏకంగా విదేశీ సంస్థలతో కలిసి పది రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది జనం కోసం ఒక్కడు చేస్తున్న యుద్ధం, ఆ యుద్ధంలో అతను గెలిచి, తన వాళ్లని కూడా గెలిపిస్తాడు. ఊపిరి ఆడని నా దేశానికి కొత్త ఊపిరి పోస్తున్నాడు అందుకే అతను మన సూపర్ హీరో, మన అందరి సూపర్ హీరో.