Sonusood: క‌త్తులు, క‌త్తెర‌లు సానాబెడ‌తాం అంటూ సోనూసూద్ ఫిట్‌నెస్‌..

Sonusood: రియ‌ల్ హీరో సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో నిరుపేద‌ల‌కు అండ‌గా నిలిచిన వ్య‌క్తి ఆయ‌న‌.. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌స్తే వెంట‌నే స్పందించి ముందుండే వ్య‌క్తి ఆయ‌న‌. ఈ క్రమంలో ఆయ‌న‌కు గుడి క‌ట్ట‌డం.. కొత్త షాప్స్‌కు ఆయ‌న పేరు పెట్ట‌డం వంటి ఆయ‌న‌పై అభిమానాన్ని చూపించారు. కాగా తాజాగా ఆ రియ‌ల్ హీరో నుంచి స‌రికొత్త వీడియో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఫిదా చేస్తోంది.

Real Hero Sonusood

క‌త్తులు, క‌త్తెర‌ల‌ను సాన‌బెట్టే సైకిల్‌పై త‌న ప్రావీణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. క‌త్తుల‌ను ప‌దును పెడుతూ ఆ వీడియోలో క‌నిపించారు. దీనికి సంబంధించిన వీడియోను తానే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి మీ ఫిట్‌నెస్‌, మీ వృత్తి చేయి చేయి క‌లిపి న‌డిస్తే ఇలా ఉంటుంది అంటూ క్యాప్ష‌న్ పెట్టారుSonusood.