Jaathiratnalu: ప్ర‌భాస్ లంబోర్ఘిణి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన జాతిర‌త్నాలు నిర్మాత‌లు.. డైరెక్ట‌ర్ షాక్‌!

Jaathiratnalu: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో జాతిర‌త్నాలు తెర‌కెక్కి ఎంతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనుదీప్ అనే కొత్త డైరెక్ట‌ర్ ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు ఆయ‌న కూడా సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రంను థియేట‌ర్ల‌లో చూస్తున్నంత‌సేపు ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వుతూనే ఉన్నారు. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ సినిమా ఊహించ‌ని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.. దీంతో ఈ చిత్ర నిర్మాత‌లు అయిన స్వ‌ప్న‌ద‌త్, ప్రియాంక‌ద‌త్‌లు ఈ చిత్ర డైరెక్ట‌ర్ అనుదీప్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చారు.

jaathiratnau latest

ప్ర‌భాస్ న‌డిపిన లంబోర్ఘిని కారు గుర్తు ఉంది క‌దా.. ఆ కారునే ఆయ‌న‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆగండి ఆగండి అక్క‌డ‌నే ఆగండి..ఈ చిత్రం ఏంటీ జాతిర‌త్నాలు క‌దా.. అలాంటి జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్‌కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి మ‌రీ.. చూడ‌గ్గానే ఆ డైరెక్ట‌ర్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. లంబోర్ఘిని బొమ్మ కారును ఆయ‌న‌కు వాళ్లు గిఫ్ట్‌గా ఇచ్చి ఫ‌న్ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వులు తెప్పిస్తుంది.