Bollywood: క‌రోనా బారిన ప‌డ్డ అమీర్‌ఖాన్‌..

Bollywood: మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంది అనే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సామాన్య ప్ర‌జ‌ల నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు.. ఈ క్ర‌మంలో బాలీవుడ్ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌లేBollywood బాలీవుడ్ యంగ్ హీరోలు వ‌రుణ్ ధావ‌న్‌, ర‌ణ్ బీర్ క‌పూర్ తో పాటు మ‌నోజ్ బాజ్ పేయి, సిద్దాంత్ చ‌తుర్వేది, తారా సుతారియా, స‌తీశ్ కౌశిక్ క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా Bollywood బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క‌రోనా ప‌డ్డారు.

Bollywood

ఈ విష‌యాన్ని అమీర్ ఖాన్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు.. అమీర్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.. ప్ర‌స్తుతం ఆయ‌న ఇంట్లో ఐసోలేట్ అయ్యారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది అని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంచితే.. అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం లాల్ సింగ్ ఛ‌ద్దా అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు ఇది రీమేక్‌గా తెర‌కెక్కుతుంది.