Kannada: ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డ హీరోయిన్‌‌..

Kannada: డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన బుజ్జిగాడు చిత్రంలో ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించింది సంజ‌న గిల్రానీ. అనంత‌రం స‌త్య‌మేవ జ‌య‌తే, అవును-2, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప‌లు చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది ఈ క‌న్న‌డ బ్యూటీ సంజ‌న‌. తాజాగా ఈ బ్యూటీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఈమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. క‌ర్ణాట‌క లోని డాక్ట‌ర్ పాషాను వివాహ‌మాడింది. వీరి పెళ్లికి కొద్ది మంది బంధువులు, స్నేహితులు హ‌జ‌ర‌య్యారని స‌మాచారం..

sanjana marriage

ఇక త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డు డిజిట‌ల్ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది. అలాగే ఆత్మ‌నిర్భ‌ర్ పేరుతో న‌టీన‌టుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది. త్వ‌ర‌లోనే త‌న డిజిట‌ల్ మీడియాకు సంబంధించిన పేరు, ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని తెలిపింది సంజ‌నా.. ఇక గ‌తేడాది శాండ‌ల్‌వుడ్‌ను ప‌ట్టి కుదిపేసిన డ్ర‌గ్స్ కేసులో సంజ‌న జైలు కెళ్లిన విష‌యం తెలిసిందే.. దాదాపుగా మూడు నెల‌ల పాటు జైల్లో ఉండి, బెయిల్‌పై బయ‌టికి వ‌చ్చి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫోటోల‌తో నానా హంగామా చేస్తుంది.