Hyderabad: అమెరికాలోని టాప్ 10 డాక్టర్స్ లో ఒకరు రాజాశ్రీనివాస్.. మరొకరు అమెరికా తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్.. ఈ అన్నదమ్ములను కన్న తల్లి హైదరాబాద్‌లోని ఓ హస్పిటల్‌లో కరోనా బారిన పడి కోన ఊపిరితో ఉంది.. ఈ క్రమంలో వీరిద్దరు అమెరికా నుంచి వచ్చి తల్లిని కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 60 రోజులకు పైగా హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ AIG లో కరోనాతో కోన ఊపిరితో పోరాడుతున్న తల్లి బారతమ్మ గారి విషయం తెలుసుకున్న ఇద్దరు కొడుకులు రాజాశ్రీనివాస్, జయశేఖర్ వారి రెండు నెలల.. కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని Hyderabadహైదరాబాద్‌కు వచ్చేసారు.
ఈ క్రమంలో నేరుగా తన తల్లి ఉన్న హస్పిటల్‌కు వెళ్లారు. దీంతో ఐసీయూలో ఉన్న అమ్మతో పాటు ఉండి అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు ఈ అన్న దమ్ముళ్ళు.. దీంతో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎన్ని ఎంత పొగిడినా తక్కువే అని Hyderabadహస్పిటల్ బృందాలు, అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు.