Uppena Team: శ్రీ‌వారి సేవ‌లో ఉప్పెన టీం.. మెట్ల‌పై సేద‌తీరుతున్న‌ వైష్ణ‌వ్‌, కృతి!

Uppena Team: ఉప్పెన చిత్రం భారీ విజ‌యంతో ఎంతో ఆనందంగా ఉన్నారు చిత్ర‌బృందం.. హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు వీరికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.. దీంతో ప్రేక్ష‌కుల్లో కూడా వారికంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.. తొలి చిత్రం హీరోగా వైష్ణ‌వ్‌తేజ్ రికార్డు కెక్కాడు.. ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌కు ప‌లువురు ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు.

Uppena Team

Uppena Teamఇక ఉప్పెన‌లా ఉప్పొంగుతున్న సంతోషంలో ఉన్న చిత్ర‌టీం ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది. ఉప్పెన చిత్ర హీరోహీరోయిన్ల్‌, డైరెక్ట‌ర్ త‌దిత‌రులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే హీరోహీరోయిన్ల్ వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి కాలిన‌డ‌క‌న కొండెక్కారు..Uppena Teamఈ క్ర‌మంలో వారు కొంత‌సేపు మెట్ల‌పై సేద తీరారు.. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.