Tollywood: స‌రికొత్త ప్రేమ‌క‌థ‌తో వ‌స్తున్నా: సుధీర్‌బాబు

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు, డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. వీరి కాంబోలో వ‌స్తున్న మూడో చిత్రంగా తెర‌కెక్కుతుంది.. వి లాంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి.. ఇందులో నాని, సుధీర్‌బాబు ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన విజ‌యం ద‌క్క‌లేదు. ఇక ఇప్పుడు మ‌రోసారి సుధీర్‌- ఇంద్ర‌గంటి కాంబో ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. నిన్న సుధీర్‌బాబు ఒక కొత్త విష‌యంతో మీ ముందుకు వ‌స్తా అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా వీరి కాంబో Tollywoodమూవీ టైటిల్‌తో పాటు చిత్ర క‌థాంశం కూడా చెప్పేశారు సుధీర్‌బాబు.

Sudheerbabu Latest Film

ప్రేమ‌క‌థ‌లు న‌చ్చ‌ని వారుండ‌రేమో క‌దా? నాలాంటి అబ్బాయి త‌ను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్ట‌మొద‌టిసారి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎలా మొద‌లు పెడ‌తారు? ఇంట్రెస్టింగ్ క‌దా? అయితే ఒక‌సారి అబ్బాయిలంతా ఆ స‌ర‌దా విష‌యాన్ని గుర్తు చేసుకోండి.. మాతో పాటు కాంటెస్ట్‌లోకి రండి అంటూ సుధీర్ కోరాడు. అలాగే మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవ‌రికైనా మొద‌టిసారి చెప్పాల్సి వ‌స్తే.. దానిగురించి మీరు ఎలా మొద‌లుపెడ‌తారు? నాకు తెలిసి చాలా మంది నేను మొద‌లు పెట్టిన‌ట్టే మొద‌లెట్టి ఉంటారు అంటూ సుధీర్ ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు.. ఇక ఈ Tollywoodచిత్రం టైటిల్‌ను మార్చి 1న చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండ‌గా.. ఇందులో సుధీర్‌బాబుకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.