Megastar: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు అదో రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి స్టార్ మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో స్వయంకృషితో అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.. బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన శంకర్‌దాదా.. అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. నటుడిగా నేటితో 43ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో తన తొలి చిత్రం పునాదిరాళ్లులో నటించేందుకు శివశంకర్ వర ప్రసాద్ కెమెరా ముందుకొచ్చాడు. ఆ పేరుతో తెలుగు తెరపై అడుగుపెట్టి మెగాస్టార్ చిరంజీవిగా వర్ధిల్లుతున్నారు.
Megastar చిరంజీవిగారు మొదట నటుడిగా పునాదిరాళ్లు సినిమా చేయగా, తెరపై ముందుగా రిలీజ్ అయినా చిత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రంలో నరసయ్య పాత్రలో నటించగా.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ హీరోగా నటించారు. అయితే కెరీర్ తొలినాళ్లలో విలన్ వేషాలు వేశాడు Megastar చిరంజీవి.. ఆ తర్వాత ఖైదీ సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. చిరంజీవి నటనతో పాటు ముఖ్యంగా తాను చేసే డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌ను Megastar చిరంజీవిగారు 2006లో అందుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ని ప్రధానం చేసింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ నుంచి పదిసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, నాలుగు నంది పురస్కారాలను అందుకున్నారుMegastar. 1987అవార్డుల వేడుకలో దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు చిరంజీవి గారే కావడం విశేషం. ఇక ఆయన 1998లో చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, పలు మానవతా కార్యక్రమాలను చేపట్టారు. అలాగే 2008లో ప్రజారాజ్యం పార్టీ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు చిరంజీవి గారు. ఇక Megastar చిరంజీవి గారు తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు.