రాధేశ్యామ్‌కి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వగా… ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించగా.. ఫిబ్రవరి 14న రాధేశ్యామ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ టీజర్ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RADHYE SHYAM MUSIC COMPOSERS

ఈ క్రమంలో రాధేశ్యామ్ మేకర్స్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రాధేశ్యామ్‌ను పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే సినిమా మొత్తానికి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా.. హిందీ వెర్షన్‌కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో సౌత్ ఇండియా లాంగ్వేజ్‌కు మరో మ్యూజిక్ డైరెక్టర్‌తో మ్యూజిక్ కంపోజ్ చేయించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. హిందీ వెర్షన్ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. మనన్ భరద్వాజ్, మిథున్ హిందీ వెర్షన్‌కి మ్యూజిక్ అందించనుండగా.. జస్టిస్ ప్రభాకరన్ సౌత్ ఇండియా వెర్షన్లకు మ్యూజిక్ అందించనున్నాడు.