ప్రభాస్ ‘సలార్’ లుక్ లీక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఒకేసారి రెండు సినిమా షూటింగ్‌లు చేస్తున్నాడు. కె.రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తవ్వగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో చేస్తున్న ఆదిపురుష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సలార్ సినిమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇటీవలే సలార్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. తెలంగాణలోని గోదావరిఖనిలోని బోగ్గు గనుల సమీపంలో ఈ షూటింగ్ నిర్వహించారు. ఈ షూటింగ్ దాదాపు 10 రోజుల పాటు జరగ్గా.. ఇటీవలే ఇది ముగిసింది. ప్రభాస్‌తో పాటు శృతిహాసన్‌పై పలు సీన్స్‌ను తెరకెక్కించారు.

PRABAHS SALAAR LOOK LEAK

ఈ షూటింగ్‌కి సంబంధించిన ఫొటోలు తాజాగా లీక్ అయ్యాయి. ఇందులో బోగ్గు గనుల సమీపంలో బుల్లెట్ బైక్‌ నడుపుతూ ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్‌తో పాటు సినిమా యూనిట్ కూడా ఈ ఫొటోలలో కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావడంతో… త్వరలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.