FCUK: జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’ చిత్రం ఫిబ్రవరి 12న, శుక్రవారం విడుదలవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్‌గా యంగ్ హీరో క్యారెక్టర్‌ను రామ్ కార్తీక్ పోషించారు. FCUK సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో రామ్ కార్తీక్ సంభాషించారు. ఆ విశేషాలు… ఈ సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చిందని రిపోర్టర్ అడగ్గా.. FCUK మా సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం హ్యాపీ. డైరెక్టర్ విద్యాసాగర్ రాజుగారి మునుపటి సినిమా ‘రచయిత’ చూశాను. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో కార్తీక్ క్యారెక్టర్‌కు ర్యాండమ్‌గా కాకుండా, చాలా మంది ప్రొఫైల్స్ చూసి నన్ను ఎంచుకున్నారని తెలిసింది. సాగర్‌గారు చాలా టాలెంటెడ్ డైరెక్టర్. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను FCUK ఈ సినిమాతో ఆయన బయటకు తెచ్చారు. ఇంటర్నల్‌గా వేసిన ఓ షోలో నా పర్ఫార్మెర్స్ను అందరూ మెచ్చుకోవడం మరింత హ్యాపీ.
FCUK టైటిల్లోని కార్తీక్ పాత్రను చేశాను. పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నా ఫాదర్‌గా చేసిన జగపతిబాబుగారిది చిలిపిగా ఉండే క్యారెక్టర్. లైక్ ఫాదర్ లైక్ సన్ తరహాలో నా క్యారెక్టర్ ఉంటుంది. అయితే నిజ జీవితంలో దానికి పూర్తి ఆపోజిట్‌గా ఉంటాననుకోండి. జగపతిబాబు గారు ఓ లెజెండరీ యాక్టర్. ఆయనతో తెర పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇద్దరి మధ్యా వచ్చే చాలా సీన్లలో ఓ ఎమోషనల్ సీన్ నాకు చాలా నచ్చింది. అది ఛాలెంజింగ్ సీన్. ఆ సీన్లో ఆయన మీద నేను కోపాన్ని ప్రదర్శించాలి. మొదట నెర్వస్‌గా అనిపించినా, ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో దాన్ని చేశాను. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్‌గానే కాకుండా ఎమోషనల్గానూ ఉంటుంది. అది ఆడియెన్స్‌కు బాగా రీచ్ అవుతుంది. కార్తీక్, ఉమ మధ్య ప్రేమకథలో సడన్‌గా చిట్టి అనే చిన్నపాప ఎంటరైతే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా లవ్ స్టోరీని ఆమె ఎలా గట్టెక్కించిందనేది? అనే పాయింట్ ఇంటరెస్టింగ్‌గా, కామిక్ వేలో ఉంటుంది. అంటే పాత్రల మధ్య ఉండే కన్ఫ్యూజన్.. మంచి ఫన్ను అందిస్తుంది. FCUK డైరెక్టర్ సాగర్‌గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను కామిక్ వేలో చెప్పారు. ఆమెతో కలిసి సీన్లు చేసేటప్పుడు మేమేం కష్టపడలేదు. చిట్టి పాత్రను బేబి సహశ్రిత చాలా బాగా చేసింది. తను బార్న్ ఆర్టిస్ట్. తన నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలంటే అది ఇచ్చేసేది. హీరోయిన్ అమ్ము అభిరామి గురించి ఏం చెబుతారు? అమ్ము అభిరామితో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఆమెది మామూలు మెమరీ కాదు. వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. తనకు సరిగా తెలుగు తెలీదు. డైలాగ్ బట్టీపెట్టేసి, పర్ఫెక్టుగా చెప్పేసేది. పాటల్లో నాకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రాసి, పాడినFCUK “పూవల్లే” బాగా ఇష్టం. అది ఎమోషనల్‌గా ఉంటుంది. పాప, జగపతిగారు, నా మీద ఆ పాట ఉంటుంది. తన కూతుర్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాటను భీమ్స్ రాశారు. నిజానికి ఆల్బమ్ మొత్తం బాగా ఉందనే టాక్ వచ్చింది. శ్రీ రంజిత్ మూవీస్ FCUK లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో పనిచేయడంపై ఏం చెబుతారు అని అడగ్గా.. నిజంగా శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో నటించే అవకాశం రావడం వెరీ హ్యాపీ. స్క్రిప్ట్ విషయంలో నిర్మాత దాము గారు చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. కేస్టింగ్ విషయంలోనూ అంతే. ఆ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే.. హిట్ అయినట్లే అనే అభిప్రాయం ఉంది. ప్రొడక్ట్ విషయంలో ఆయన అంత శ్రద్ధ చూపిస్తారు. FCUKఈ సినిమాకు నలుగురు పిల్లర్లు. దాముగారు, సాగర్‌గారు, జగపతిబాబు గారు, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్లు ప్రధాన కారణం అని రామ్‌కార్తీక్ చెప్పుకొచ్చారు.