‘రాములో రాముల’ నెవ్వర్ బిఫోర్ రికార్డు

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అత్యధిక వ్యూస్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించాయి. బుట్టబొమ్మ, రాములో రాములా పాటలు సూపర్ హిట్ అవ్వగా.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న సౌత్ ఇండియన్ సినిమా పాటలుగా నిలిచాయి.

ramulo ramula song creates record

తాజాగా రాములో రాములా పాట మరో రికార్డు సృష్టించింది. 300 మిలియన్ వ్యూస్ క్రాక్ చేసిన తొలి సౌత్ ఇండియా పాటగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే అనేక రికార్డులను సాధించిన ఈ పాట.. ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.