Uppena: ఆ హీరోపై క్ర‌ష్ ఉంది: ఉప్పెన ఫేం కృతిశెట్టి

Uppena: మెగా కాంపౌండ్ నుంచి వ‌స్తున్న వైష్ణ‌వ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌గ్గ‌ర స‌హ‌య‌ద‌ర్శ‌కుడిగా పనిచేసిన బుచ్చిబాబు Uppena ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌ముఖ న‌టుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌గా.. వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

uppena heroine

ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై వై. ర‌విశంక‌ర్‌, వై. న‌వీన్ నిర్మిస్తుండ‌గా.. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా Uppenaఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే Uppena ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ భాగంగా ఉప్పెన ఫేం కృతిశెట్టి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెబుతూ.. వైష్ణ‌వ్‌తేజ్ ఎంతో మ‌ధుర‌మైన‌వాడ‌ని చాలా ప్ర‌శాంతంగా ఉండే గొప్ప న‌టుడు అని పొగిడేసింది. అలాగే త‌న‌కు రామ్‌చ‌ర‌ణ్ అంటే చాలా ఇష్టం. రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించాల‌నుంద‌న్న త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల్ని చెప్పేసింది. అలాగే అంద‌మైన హీరో ఎవ‌రు అని రిపోర్ట‌ర్ అడ‌గ్గా.. అంద‌మైన హీరో మ‌హేశ్‌బాబు అంటూ మ‌న‌సులో మాట చెప్పింది కృతి. ఇక ఈ చిత్రం కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్న మెగాభిమానులు.. ఫిబ్ర‌వ‌రి 12న Uppena ఉప్పెన‌లా త‌ర‌లివ‌చ్చేలా వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.