టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కి పంపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు గంటా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు ప్రాజాప్రతినిధులందరూ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.