Allu Arjun AND Vijay: అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ కాంబోలో భారీ మల్టీస్టారర్ మూవీ

Allu Arjun AND Vijay: అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. బన్నీ, విజయ్ దేవరకొండ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంతో వీరిద్దరి కాంబోలో ఒక మల్టీస్టారర్ సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాత్ర ఫేం మహి వి రాఘవ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.

vijay and bunny combo movie

ఇటీవలే బన్నీ-విజయ్‌లను కలిసి అతడు స్టోరీ నరేట్ చేశాడట. ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇవ విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు పూర్తైన తర్వాత బన్నీ-విజయ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.