Prabhas: “రాధేశ్యామ్” టీజ‌ర్‌కు ‌ముందే.. త‌న‌లో తాను ప్రేమ‌లో ఒదిగిపోయిన ప్ర‌భాస్ వీడియో

Prabhas: బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంత‌రం సాహో చిత్రంలో న‌టించి ప్రేక్ష‌కాభిమానుల్లో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు Prabhas ప్ర‌భాస్‌. తెలుగులో ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌కున్నా.. వేరే భాష‌ల్లో మంచి విజ‌యం న‌మోదు చేసుకుంది సాహో చిత్రం. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

prabhas radheshyam

ఇప్ప‌టికే రిలీజ్ అయినా ఈ మూవీ పోస్ట‌ర్స్ సినీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను ప్రేమికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం. అయితే టీజ‌ర్‌కు ముందే తాజాగా రాధేశ్యామ్ నుంచి స‌రికొత్త వీడియోను పంచుకుంది చిత్ర‌బృందం. బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ న‌డిచే సీన్‌, సాహో సినిమాలో Prabhas ప్ర‌భాస్ ఫైట్ చేసే సీన్ జ‌త చేసి.. త‌న‌లో తానే లోలోప‌ల ఏదో ప్రేమైక ఆలోచిస్తూ న‌డుచుకుంటూ వెళ్లే వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్ర‌భాస్ బ్లాక్ ఫార్మ‌ల్ ప్యాంట్ వైట్ ష‌ర్ట్ దీనిపై రెడ్ బ్లెజ‌ర్‌తో చాలా స్టైలిషుగా క‌నిపించాడు. ఇక రాధేశ్యామ్ చిత్రంలో Prabhas ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌గా.. జ‌స్టీన్ ప్ర‌భాక‌ర‌ణ్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.